TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

హెచ్.నరసింహయ్య

The Typologically Different Question Answering Dataset

హెచ్.ఎన్. 1962లో బెంగళూరు సైన్స్ ఫోరాన్ని స్థాపించాడు. ఈ సంస్థ ప్రతి వారం సైన్స్ అంశాలపై ప్రసంగాలను ఏర్పాటు చేసి ప్రజలకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించింది. ఈ సంస్థ ఇప్పటివరకు ప్రముఖ శాస్త్రజ్ఞులచే 2000 ప్రసంగాలను ఇప్పించింది. 500 పాపులర్ సైన్స్ ఫిల్ములను ప్రదర్శించింది. ఇతడు బెంగళూరు లలితకళా పరిషత్, బి.వి.జగదీష్ సైన్స్ సెంటర్‌ల ఆవిర్భావానికి కూడా కృషి చేశాడు. ఇతడు బెంగళూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఉన్నప్పుడు ఏప్రిల్ 1976లో "మూఢ నమ్మకాలను, మహిమలను హేతుబద్ధంగా పరిశోధించే సంస్థ"ను స్థాపించాడు. నియంత్రితమైన (ప్రయోగానుకూలమైన) పరిస్థితులలో తన మహిమలను చూపమని ఈ కమిటీ సత్య సాయి బాబాకు మర్యాదపూర్వకంగా లేఖ వ్రాసింది. ఆ పై మరో రెండు లేఖలు వ్రాసినా బాబా స్పందించలేదు. వారి విధానం అనుచితంగా ఉన్నదని,"ఇంద్రియాలకు లోబడేది విజ్ఞాన శాస్త్రం. అతీంద్రియమైనది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక సాధన ద్వారానే దానిని తెలుసుకోవచ్చును. విశ్వంలో అద్భుతాలలో కొద్ది విషయాలను మాత్రమే విజ్ఞానశాస్త్ర్రం వెలిబుచ్చగలిగింది" - అని బాబా అన్నాడు. తమ అభ్యర్ధనకు సాయిబాబా మిన్నకుండడాన్నిబట్టి బాబా మహిమలు బూటకమని తేలుతున్నదని నరసింహయ్య అన్నాడు. మొత్తానికి వార్తా పత్రిలలో ఈ విషయమై చాలా కాలం వాద ప్రతివాదాలు నడచాయి. ఇతడు స్థాపించిన కమిటీ 1977లో రద్దయ్యింది. ప్రొఫెసర్ పౌల్ కుర్ట్జ్ ఏర్పరచిన కమిటీ ఫర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ ది క్లెయిమ్స్ ఆఫ్ ది పారానార్మల్ (CSICOP) లో భారతదేశం నుండి ఇతడొక్కడే ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు జన్మతః హిందువే అయినా మూఢమైన ఆచారాలను పాటించలేదు. ఇతని తండ్రి మరణించినప్పుడు శ్రాద్ధకర్మలలో భాగంగా శిరోముండనం చేయించుకోవడానికి తిరస్కరించాడు. గ్రహణం పట్టినప్పుడు ఆహారం తీసుకుంటే ఏమీకాదని నిరూపించడానికి గ్రహణం సమయంలో భోజనం చేసి చూపించాడు. 1983లో భారత హేతువాద సంఘానికి అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. 1995లో భారత ప్రభుత్వం ఇతడిని కన్నడ డెవెలప్‌మెంట్ అథారిటీకి ఛైర్మన్‌గా నియమించింది.

హెచ్.నరసింహయ్య సైన్స్ ఫోరాన్ని ఎక్కడ స్థాపించాడు?

  • Ground Truth Answers: బెంగళూరుబెంగళూరు

  • Prediction: