TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

సాలెపురుగు

The Typologically Different Question Answering Dataset

మాంసభక్షణ అనివార్యమైన జంతువులలో సాలెపురుగు (ఆంగ్లం Spider) ఒకటి. చిన్నచిన్నపురుగులు కీటకాలు దీనికి ఆహారం. ఆహారం కోసం ఇది చక్కగా వల అల్లి దీనిలో చిక్కిన పురుగులను తిని జీవిస్తుంది. దీని శరీరం రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. తలభాగం ఛాతీ భాగంతో కలసి ఉంటుంది. సాలెపురుగుకు ఎనిమిది (8) కాళ్ళు ఉంటాయి. శరీరపు వెనక భాగం కింది వైపు పట్టుదారం తయారు చేసే గ్రంధులు ఉంటాయి. గ్రంథుల నుండి స్రవించే చిక్కటి ద్రవపదార్ధం గాలికి చల్లబడి దారంగా మారుతుంది. ఈ పద్ధతిలో మనం సోన్ పాపిడి తయారు చేస్తాము. సాలెపురుగు కాటులో స్వల్పమైన విషం ఉంటుంది. కానీ దాని గాఢత తక్కువ కనుక చాలా హానికరం కాదు. విషం ఆహారపు కీటకాన్ని నిర్వీర్యం చేయడానికి పనికి వస్తుంది. సాలెపురుగు ఆహారాన్ని నిర్వీర్యంచేసి నిదానంగా తింటుంది. సాలెపురుగుకి నమిలే అవయవాలు ఉండవు. నోటిలో స్రవించే విషం ఆహారన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పాములుకు కూడా విషం ఈ విధంగా ఉపయోగపడుతుంది.

సాలెపురుగుకి ఎన్ని కాళ్లు ఉంటాయి?

  • Ground Truth Answers: ఎనిమిదిఎనిమిది

  • Prediction: