అర్జునులు ప్రతిష్ఠించిన శివాలయం పేరు మీదగా విజ్జేశ్వరం అని వచ్చింది విజ్జేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలానికి చెందిన గ్రామము.[1]. విజ్జేశ్వరం రాజమండ్రికి 20 కి.మీ. దూరంలో నిడదవోలుకి 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో సహజ వాయువు చేత విద్యుత్తు తయారు చేసే కేంద్రం ఉంది. ఈ కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో నడుచు జనకొం క్రిందకు విద్యుత్తు తయారు చేస్తోంది. 1998 సంవత్సరం డిసెంబరు నాటికి ఈ కేంద్రం మెదటి దశలో 60 మెగావాట్ల విద్యుత్తు తయారు చేసింది. ఇప్పుడు రెండవ దశ పూర్తి అయ్యాక 172 మెగావాట్ల విద్యుత్తు తయారీ జరుగుతోంది. ఈ కేంద్రానికి బడ్జెట్ 434 కోట్లు కేటాయించగా 471 కోట్లయ్యింది.{{ref:|బడ్జెట్}} ఈ కేంద్రం భారతదేశంలోనే మెట్టమెదటి సహజవాయువు ద్వారా విద్యుత్తు తయారు చేయబడే కేంద్రం. ఇది మండల కేంద్రమైన నిడదవోలు నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 718 ఇళ్లతో, 2640 జనాభాతో 282 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1363, ఆడవారి సంఖ్య 1277. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 426 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 3. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588305[2].పిన్ కోడ్: 534302. గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. విజ్జేశ్వరంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
విజ్జేశ్వరం గ్రామ విస్తీర్ణం ఎంత ?
Ground Truth Answers: 282 హెక్టార్ల282 హెక్టార్ల282 హెక్టార్ల
Prediction: