శ్రీకాకుళం జిల్లా లోని గార మండలం కొంక్యానపేటలో 1948 జూలై 6లో కొంక్యాన సూరమ్మ, సూర్యనారాయణ దంపతులకు ఛాయరాజ్ జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఊళ్లోనే సాగింది. బిఎస్సీ బిఇడి చేసిన ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు. సామాజికశాస్త్రంలో ఎం.ఎ. చదివారు. ఈయన జీవ శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేశారు. 2005లో గజిటెడ్ ప్రధానోపాధ్యాయునిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దూసిపేట లో ఉద్యోగ విరమణ పొందారు. మొదటి నుండి సాహిత్య కృషి సాగించారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటాన్ని కావ్యరూపంగా మలిచారు. కొండకావ్యం 'గుమ్మ', స్త్రీ, పురుష సంబంధాలను విప్లవీకరించిన 'నిరీక్షణ', బుదడు, తొలెరుక, మన్ను నన్ను మౌనంగా ఉండనీయదు, మాతృభాష, దర్శిని, రసస్పర్శ, దుఖ్ఖేరు తదితర కథలు, కావ్య రచనలు చేశారు. ఆయన రచనలు శ్రీకాకుళం, కారువాకిని ఇటీవలే ఆవిష్కరించారు. 1980లో జనసాహితీలో సభ్యునిగా చేరిన ఛాయరాజ్ 2007 నుండి ఇప్పటివరకూ ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్, తెలుగు వెలుగు, ఆంధ్రప్రదేశ్ సాహితీ సాంస్కృతిక సమాఖ్య, జిల్లా సాంస్కృతిక మండలి అవార్డులు అందుకున్నారు.
ఛాయరాజ్ ఎక్కడ జన్మించాడు?
Ground Truth Answers: శ్రీకాకుళం జిల్లా లోని గార మండలం కొంక్యానపేటశ్రీకాకుళం జిల్లా లోని గార మండలం కొంక్యానపేటశ్రీకాకుళం జిల్లా లోని గార మండలం కొంక్యానపేట
Prediction: