అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నప్పుడు ఆర్య పక్క ఇంటిలోఉండే సినిమాటోగ్రఫర్ జీవా తను తీయబోయే సినిమా ఉల్లమ్ కెట్కుమాయే సినిమాలో నటించేందుకు ఆడిషన్స్ కు రమ్మని ఆర్యను అడిగారు. ఈ సినిమాకు ఒప్పుకున్న ఆయన పేరును ఆర్యగా మార్చారు జీవా.[7] ఈ సినిమా నిర్మాణం ఆలస్యం అయింది.[8] దాంతో విష్ణువర్ధన్ దర్శకత్వంలో అరినుథమ్ అరియమలుమ్(2005) సినిమాతో తెరంగేట్రం చేశారు ఆయన. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది.[9][10] ఈ సినిమాలో గాంగ్ స్టర్ కొడుకుగా ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అంతే కాక 2005లో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆయన.[11] ఆర్య నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.[12] చాలా ఏళ్ళ తరువాత ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకంటూ ఓ గుర్తింపు రావడానికి కారణం యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన తీ పిడికా పాట వల్లే అని గుర్తుచేసుకున్నారు.[7] 2003లో మొదలైన ఉల్లమ్ కెట్కుమయే సినిమా 2005లో విడుదలై మంచి విజయం సాధించింది. కాలేజీలో క్రికెటర్ పాత్రలో నటించిన ఆర్యకు ప్రశంసలు లభించాయి.[13] 2005లోనే తన మూడో సినిమా ఒరు కల్లురియిన్ కథై సినిమా హిట్ కాలేదు.[14] కానీ ఆయన నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. దాంతో ఆర్యను తమిళ సినీ రంగంలో యువ కెరటంగా భావించారు సినీజనాలు. ఆయనకు ఆ తరువాత అవకాశాలు కూడా చాలా ఎక్కువే వచ్చయి.[15]
ఆర్య నటించిన మొదటి చిత్రం ఏది?
Ground Truth Answers: అరినుథమ్ అరియమలుమ్(2005)అరియమలుమ్(2005)అరినుథమ్ అరియమలుమ్(2005)
Prediction: