TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

శ్రీహరికోట

The Typologically Different Question Answering Dataset

శ్రీహరికోట (ఆంగ్లం: Sriharikota) నెల్లూరు జిల్లాలోని ఒక తీరప్రాంతపు ద్వీపము, ఆంధ్రప్రదేశ్ లోని కోరమాండల్ తీరంలో గలదు. ఇచ్చట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం గలదు, ఈ కేంద్రాన్ని ఇస్రో వారు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుండి భారతదేశం తన రాకెట్లను ప్రయోగిస్తుంది. దీనికి దగ్గరలోని పట్టణం సూళ్ళూరుపేట. 

శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రము ఏ రాష్ట్రంలో ఉంది?

  • Ground Truth Answers: ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్

  • Prediction:

శ్రీరాముడు ఈదీవిలో అరకోటి లింగాలను ప్రతిష్ఠించి, ఇక్కడ రాక్షస ప్రభావాన్ని తొలగించాడనీ అందువల్లనే ఈ ప్రాంతానికి శ్రీ అరకోటై గా పేరు వచ్చి కాలక్రమంలో ఈ పేరు ప్రజల నోళ్ళలో నాని, శ్రీహరికోటగా మారిందిన అక్కడి ప్రజలు భావిస్తారు. రాకెట్ ప్రయోగ కేంద్రం స్థాపించక మునుపు ఈ ప్రాంతం నాగరికతకు ఎంతో దూరం. అమాయకులైన గిరిజన తెగలు నివసించే ప్రాంతం. 1970 వరకూ అంతరిక్ష పరిశోధనలకు కేరళ లోని తిరువనంతపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న తుంబా అంతరిక్ష కేంద్రాన్ని ఉపయోగించేవారు. కానీ దీని చుట్టూ జనసంచారం ఎక్కువగా ఉండేది. పైగా ఆ కేంద్రం మినీ రాకెట్ ప్రయోగాలకే పరిమితం. భవిష్యత్తులో చేయబోయే భారీ రాకెట్ ప్రయోగాల దృష్ట్యా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరోచోట రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో అనువైన రాకెట్ ప్రయోగ కేంద్ర స్థలం కోసం అన్వేషణలో భాగంగా దేశంలో అన్ని ప్రాంతాలనూ పరిశీలిస్తూ రాగా ఈ దీవి కంటపడింది. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఈ దీవి రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైనదిగా భావించిన సారాభాయ్ బృందం ఆ విషయాన్ని ఇస్రోకు తెలిపింది. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది.

శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రము ఏ రాష్ట్రంలో ఉంది?

  • Ground Truth Answers: ఆంధ్రప్రదేశ్

  • Prediction: