మెడిలియన్ స్లేడ్ (మీరాబెన్) (1892 నవంబరు 22 – 1982 జూలై 20), బ్రిటన్ వనిత. బ్రిటీష్ సైన్యాధిపతి సర్. ఎడ్మిరల్ స్లేడ్ కుమార్తె. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకి ఆకర్షితురాలై భారత స్వతంత్య్ర పోరాటంలో గాంధీతో కలిసి పనిచేయడానికి తన ఇంటిని వదిలి వచ్చిన మానవతా వాది. స్లేడ్ తన జీవితాన్ని మానవాభివృద్ధికి దోహదం చేసిన వనిత. గాంధీ సిద్ధాంతాలని ఆచరిస్తూ దేశస్వాతంత్య్రానికి ఉద్యమించిన ఈమెకు మహాత్మాగాంధీ శ్రీకృష్ణభక్తురాలైనా మీరా బాయ్ పేరుని పెట్టారు. అప్పటి నుండి స్లేడ్ మీరా బెహన్‌గా పిలవబడుతూ అందరికీ ఎంతో చేరువయ్యింది.