కాల్షియం (Calcium){సంస్కృతం: ఖటికం} ఒక మెత్తని ఊదారంగు గల క్షార మృత్తిక లోహము. దీని సంకేతము Ca మరియు పరమాణు సంఖ్య 20. ఇది విస్తృత ఆవర్తన పట్టికలో 2వ గ్రూపు, నాల్గవ పీరియడుకు చెందిన మూలకం. దీని పరమాణు భారము 40.078 గ్రా/మోల్[1]. ఇది భూపటలం (crust) లో అత్యధికంగా దొరికే ఐదవ మూలకము మరియు ఇనుము, అల్యూమినియం తరువాత అత్యధికంగా లభ్యమయ్యే మూడవ లోహం. ఇది భూమిపై సాధారణంగా సమ్మేళన రూపంలో కాల్షియం కార్బొనేట్ (సున్నపురాయి) గా లభ్యమవుతుంది. సముద్రాలలో శిలాజరూపంలో ఉన్న జిప్సం, ఎన్హైడ్రైట్, ఫ్లోరైట్ మరియు అపాటైట్ వంటివికూడా కాల్షియం యొక్క వనరులే.
కాల్సియం పరమాణు భారం ఎంత?
Ground Truth Answers: 40.078 గ్రా/మోల్40.078 గ్రా/మోల్40.078 గ్రా/మోల్
Prediction: