అరబిందో ఆగస్టు 15, 1872 న కోల్కతాలో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణ లతా దేవి. తండ్రి కె.డి.ఘోష్. వైద్యుడు. ఈయన బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు. అరవిందుల మాతామహులు సుప్రసిద్ధ బ్రహ్మ సామాజికులయిన రాజనారాయణబోసు. వీరు సంస్కృతాంగ్ల భాషలలో మహావిద్వాంసులు. వీరు కుమార్తె శ్రీమతి స్వర్ణలతాదేవి అరవిందుల జనని. అరవిందుల జనకులు కృష్ణధనఘోష్. వీరు పూర్వులు బ్రహ్మ సమాజ విరోధులైనా వీరు మాత్రం బ్రహ్మసమాజంపట్ల అభిమానం చూపిస్తూ ఉండేవారట. కనుకనే వీరు బ్రహ్మసమాజ కన్యను వివాహం చేసుకున్నారు. ఈ వివాహానైకి మహర్షి దేవేంద్రనాధ్ ఠాకూర్ స్వయంగా పౌరోహిత్యం జరిపారట. వీరిద్దరికి 4 కుమారులు, ఒక కుమార్తె. వీరిలో మొదటి కుమారుని పేరు వినయభూషణుడు, రెండవవాడు మనోమోహనుడు, మూడవవాడు అరవిందులు, నాలగవ సరోజినిదేవి, చివరి వారు వారీంద్రుడు. ఈతడు వంగదేశంలో ప్రఖ్యాత విప్లవకారుడు. సరోజినీదేవి ఆజన్మ బ్రహ్మ చారిణి అయి ఆధ్యాత్మిక అన్వేషణా పరురాలుగా పేరుగాంచింది.
అరబిందో ఎప్పుడు జన్మించాడు?
Ground Truth Answers: ఆగస్టు 15, 1872కోల్కతాఆగస్టు 15, 1872
Prediction: